జాతీయ రహదారి నుంచి ప్రకాశం జిల్లా చినగంజాం మండలం తీరప్రాంతమైన పెదగంజాంకు సూచికల బోర్డులు లేవు. గ్రామానికి వెళ్లేందుకు వాహనదారులు, కొత్తవారు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన అరోరా గ్రామాభివృద్ధి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వల్లబుని ఉదయభాస్కర్... కొంత మంది సభ్యులు కలిసి రూ. 15 వేల వ్యయంతో ఓ బోర్డును తయారుచేయించి జాతీయరహదారి పక్కన అమర్చారు.
ఊరు దారి సూచిక బోర్డు ఏర్పాటు చేసిన యువకులు - చినగంజాం తాజా వార్తలు
216వ జాతీయ రహదారి నుంచి పెదగంజాంకు వెళ్లాలంటే సూచిక బోర్డులు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన కొందరు యువకులు.. కొంత మొత్తం సేకరించి ప్రధాన రహదారిపై బోర్డును ఏర్పాటు చేశారు.
పెదగంజాం బోర్డు పెట్టిన అరోరా గ్రామాభివృద్ధి సమితికి చెందిన యువకులు