కురిచేడు మరణాలపై సమగ్ర విచారణ చేసి కారణాలు వెలికి తీయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శానిటైజర్ తాగి ప్రకాశం జిల్లా కురిచేడులో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోందన్నారు. నాటుసారాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. ఇన్ని జరుగుతుంటే మద్య విమోచన కమిటీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. మద్యనిషేధంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఈ ఘటనతో అర్థం అవుతోందంటూ విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలో డీ-ఎడిక్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు.
మద్య విమోచన కమిటీ ఏం చేస్తోంది: పవన్ కల్యాణ్ - కురిచేడు ఘటనపై పవన్ కల్యాణ్ స్పందన వార్తలు
ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 9 మంది మృతిచెందిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే మద్య విమోచన కమిటీ ఏం చేస్తోందని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్
Last Updated : Jul 31, 2020, 3:59 PM IST