ప్రతిఒక్కరిని నోట్ల కట్టలతో కొనేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. తనను సీఎం చేసేందుకు 1500కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వజూపారని జమ్ముకశ్మీరు మాజీముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అల్లా సాక్షిగా తెలిపారు... మరి దేవుని సాక్షిగా నువ్వు అవన్నీ అబద్దాలనిచెప్పగలవా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. తాను నటుణ్ని.. కానీ జగన్‌లా రాజకీయ నటుడిని మాత్రం కాదన్నారు.
ఇవీ చూడండి.