ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యురాలు వేధిస్తోందని ఆరోపిస్తూ రోగి ఆత్మహత్యాయత్నం - నాగిరెడ్డిపల్లిలో రోగి ఆత్మహత్యాయత్నం వార్తలు

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ రోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వైద్యురాలు హైమావతి.. రోగులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించాడు. మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ అతను పెట్రోలు పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు.

patient suicide attempt in nagireddi palle prakasam district
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద స్థానికుల ఆందోళన

By

Published : Jun 21, 2020, 6:40 AM IST

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ రోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మద్దెల వెంకట నారాయణ అనే వ్యక్తి కొంతకాలంగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడి వైద్యురాలు హైమావతి రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించాడు.

తమను మానసికంగా వేధిస్తోందని అంటూ.. పెట్రోలు పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అయితే స్థానికులు కూడా ఆమెపై అదే ఆరోపణ చేశారు. మొదటినుంచీ ఆమె అలానే ప్రవర్తిస్తోందని, ఆమెను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details