ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Village Secretariat Locked: గ్రామ సచివాలయానికి కాంట్రాక్టర్​ తాళం... ఎందుకంటే..? - ప్రకాశం జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Village secretariat locked: చేసిన పనులకు బిల్లులు రావడం లేదు.. లక్షలాది రూపాయలు అప్పులు చేసి పనులు పూర్తి చేసి రెండేళ్లైనా ప్రభుత్వం స్పందించడం లేదు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక కాంట్రాక్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు.. దీంతో దిక్కుతోచక ఓ కాంట్రాక్టర్​ గ్రామ సచివాలయానికి తాళం వేశాడు..

Village secretariat locked
గ్రామ సచివాలయానికి తాళం

By

Published : Apr 19, 2022, 1:27 PM IST

గ్రామ సచివాలయానికి తాళం

Village secretariat locked: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామ సచివాలయానికి.. గుత్తేదారు అంజిరెడ్డి తాళం వేశారు. 2020 ఫిబ్రవరి 10న భూమి పూజ చేసి..త్వరితగతిన సచివాలయ భవనం నిర్మించారు. 2020సెప్టెంబర్ 17న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సచివాలయం భవనాన్ని ప్రారంభించారు. గ్రామ సచివాలయం నిర్మాణం కోసం రూ.40 లక్షలు ఖర్చు చేశానని గుత్తేదారు తెలిపారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నట్లు వాపోయారు. రెండేళ్లైనా బిల్లులురాక పోవటంతో విసుగు చెంది తాళం వేసినట్లు గుత్తేదారు అంజిరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: ఆడుకుంటూ అడవిలోకి చిన్నారి.. 36 గంటల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

ABOUT THE AUTHOR

...view details