పర్చూరు నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి సాంబశివరావు విస్తృత ప్రచారం
పర్చూరు నియోజకవర్గంలో సాంబశివరావు ప్రచారం - Eluri Sambashivarao
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో తెదేపా ప్రచారం జోరుగా సాగింది. ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
![పర్చూరు నియోజకవర్గంలో సాంబశివరావు ప్రచారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2865016-30-2e6d50df-881b-46e7-9f08-83c17feeea37.jpg)
పర్చూరు నియోజకవర్గంలో సాంబశివరావు విస్తృత ప్రచారం
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని... ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తెదేపాను గెలిపిస్తాయని ఏలూరి తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. పర్చూరులోని కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు.