తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తెదేపాలోనే కొనసాగుతానని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. మార్టూరు మండలం దర్శిలో మాట్లాడిన ఆయన.. కొందరు తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మార్పుపై తాను ఎవరినీ సంప్రదించలేదని.. ఆ అవసరం కూడా లేదని అన్నారు. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు.
'పార్టీ మారే ఉద్దేశం లేదు.. తెదేపాలోనే కొనసాగుతా' - tdp mla sambasivarao news
తాను పార్టీ మారుతానని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. తనకు అలాంటి ఉద్దేశం లేదని.. తెదేపాలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
'పార్టీ మారే ఉద్దేశం లేదు.. తెదేపాలోనే కొనసాగుతా'
Last Updated : May 31, 2020, 3:00 PM IST