ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కానిస్టేబుల్​కు కరోనా...కంటైన్​మెంట్​ జోన్​గా పర్చూరు

ప్రకాశం జిల్లా పర్చూరును కంటైన్​మెంట్ జోన్​లోకి మారుస్తూ..అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చెన్నై నుంచి స్వగ్రామం పర్చూరుకు వచ్చిన ఓ కానిస్టేబుల్​కు వైరస్ సోకటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

By

Published : Jun 11, 2020, 7:55 AM IST

Published : Jun 11, 2020, 7:55 AM IST

Updated : Jun 11, 2020, 9:54 AM IST

కానిస్టేబుల్​కు కరోనా...కంటైన్మెంట్ జోన్​గా పర్చూరు !
కానిస్టేబుల్​కు కరోనా...కంటైన్మెంట్ జోన్​గా పర్చూరు !

కరోనా పాజిటివ్ కేసు కారణంగా ప్రకాశం జిల్లా పర్చూరును కంటైన్​మెంట్ జోన్​లొకి మార్చారు. చెన్నైలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్​గా పనిచేస్తూ... ఇటీవల స్వగ్రామానికి వచ్చిన పర్చూరువాసికి పాజిటివ్ నిర్దరణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పర్చూరును కంటైన్​మెంట్ జోన్​గా ప్రకటించారు.

ఆ కానిస్టేబుల్ ఈనెల 7న ఇంటికి రాగా... స్థానికుల సమాచారం మేరకు అధికారులు 8న ఇంకొల్లులోని క్వారంటైన్​ కేంద్రానికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. ఫలితాల్లో కరోనా నిర్ధరణ అయింది. అతనితో సన్నిహితంగా మెలిగిన 12 మందిని ప్రథమ కాంటాక్ట్​గా గుర్తించారు. వారిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Jun 11, 2020, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details