ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో తుది ఫలితాలకు అర్ధరాత్రి పట్టే అవకాశం - prakasam district latest news

ప్రకాశం జిల్లాలో తొలిదశ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. తుది ఫలితాలు వచ్చేసరికి అర్ధరాత్రి పట్టే అవకాశం ఉంది.

panchayat election counting in prakasam
ప్రకాశం జిల్లాలో తొలిదశ ఎన్నికలు కౌంటింగ్

By

Published : Feb 9, 2021, 9:27 PM IST

మొదటిదశ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలో తుది ఫలితాలు వచ్చేసరికి అర్ధరాత్రి పట్టే అవకాశం ఉంది. వేటపాలెం మండలంలో వార్డు సభ్యుల కౌంటింగ్ ముగిసింది. పర్చూరు నియోజకవర్గంలో మొత్తం 95 పంచాయతీలకు 15 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 80 పంచాయతీల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. 40 వరకు సర్పంచ్​ల ఫలితాలు ప్రకటించారు. తుది ఫలితాలు వచ్చేసరికి అర్ధరాత్రి కానుంది. ఫలితాలు వెలువడిన వెంటనే అక్కడే ఉపసర్పంచ్​ను ఎన్నుకుంటారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details