చూశారా.. రంగులు మారుతున్నాయ్..! - undefined
రాష్ట్రంలో అధికారం మారేసరికి క్షేత్రస్థాయి నుంచి ఆ మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న పసుపు రంగు కార్యాలయాలు.. ఇప్పుడు కొత్త రంగుల్లో కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ కార్యాలయాలకు రంగు పడతుంది
ప్రభుత్వ కార్యాలయాలకు రంగు పడతుంది
సంక్షేమ పథకాల అమలు తీరు సంగతి ఏమో కానీ.. ప్రభుత్వ కార్యాలయాల రంగులు మాత్రం అద్భుతంగా మారిపోతున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక.. నీటి ట్యాంకర్ల దగ్గర మాత్రమే కనిపించిన జెండా రంగులు.. క్రమేణా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కనిపిస్తున్నాయి. ఇందుకు చక్కని ఉదాహరణే... ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గ్రామం. నిన్నమెున్నటి వరకు పసుపు రంగుతో కనిపించిన ఇక్కడి పంచాయితీ కార్యాలయం... ఇప్పుడు అధికార వైకాపా జెండా రంగుతో కనిపిస్తోంది. ఈ తీరు.. సర్వత్రా చర్చనీయాంశమైంది.