ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సామాజిక సేవకు పురస్కారం.. సంకురాత్రికి 'పద్మశ్రీ'తో సత్కారం - సంకురాత్రి చంద్రశేఖర్​ స్వస్థలం

SANKURATHRI CHANDRASEKHAR : విమాన ప్రమాదం ఆయన కుటుంబాన్ని కకావికలం చేసింది. భార్య బిడ్డలను.. దూరం చేసింది. ఐనా.. ఆయన కుంగిపోలేదు. సమాజమే.. తన కుటుంబం అనుకున్నారు. సేవా పథంలో అడుగుపెట్టారు. ఆయన సంకల్పం వేల కుటుంబాల్లో.. విద్యా వెలుగులు విరజిమ్మింది. లక్షల కుటుంబాలకు కాంతి రేఖగా నిలిచింది. సంఘ సేవకుడు సంకురాత్రి చంద్రశేఖర్‌ను.. పద్మశ్రీ పురస్కారం వరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

SANKURATHRI CHANDRASEKHAR
SANKURATHRI CHANDRASEKHAR

By

Published : Jan 27, 2023, 8:18 AM IST

SANKURATHRI CHANDRASEKHAR : డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌..! ప్రకాశం జిల్లా సింగరాయకొండలో...1943లో జన్మించారు. రాజమహేంద్రవరంలో.. ప్రాథమిక, కళాశాల విద్య అభ్యసించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం జువాలజీ విభాగంలో పీజీ చేసి, కెనడా ఆల్బెట్టా విశ్వవిద్యాలయంలో.. పీహెచ్​డీ పొందారు. అక్కడ ఉన్నత ఉద్యోగం చేశారు. 22 ఏళ్లపాటు కెనడాలోనే గడిపారు.

భార్యా బిడ్డలు కెనడా నుంచి దిల్లీ వస్తుండగా విమానాన్ని ఖలిస్థాన్ ఉగ్రవాదులు పేల్చేశారు. అలా కుటుంబాన్నేకోల్పోయారాయన. ఒంటరి జీవితాన్ని భరించలేక కెనడాలో ఉద్యోగం వదిలేశారు. స్వదేశానికి తిరిగొచ్చారు. కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం వద్ద.. సంకురాత్రి ఫౌండేషన్ స్థాపించారు. 30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కుమార్తె పేరిట శారద విద్యాలయం స్థాపించారు చంద్రశేఖర్‌. పదో తరగతి వరకూ.. ఉచిత విద్య అందిస్తున్నారు. చుట్టు పక్కల పాఠశాలల విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేసి ప్రోత్సహిస్తున్నారు. కుమారుడు పేరిట శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి.. ఏర్పాటు చేశారు. దీని ద్వారా విశాఖ నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల వరకూ..ఉచిత కంటి వైద్య సేవలు అందిస్తున్నారు.

శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా ఇప్పటిదాకా 37 లక్షల మందికి పైగా సేవలు పొందారు. 3 లక్షల 40 వేల మంది కంటి శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. వీరిలో.. 90 శాతం మంది ఉచితంగా వైద్యం పొందడం విశేషం. కాకినాడ నాగమల్లి తోటలో భార్య పేరిట మంజరి సంగీత విద్యాలయం ఏర్పాటు చేసి కళాకారుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆయన సేవలను కేంద్ర ప్రభుత్వం.. పద్మశ్రీ పురస్కారంతో గౌరవిచింది. చంద్రశేఖర్‌ సేవలను కేంద్రం గుర్తించడంపై శ్రేయోభిలాషులు.. హర్షం వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరూ తన పరిధిలో.. తోచినమేర సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చిన చంద్రేశేఖర్‌... యువత ఇందులో ముఖ్య భూమిక పోషించాలని ఆకాంక్షించారు.

సామాజిక సేవకు పురస్కారం.. సంకురాత్రికి 'పద్మశ్రీ'తో సత్కారం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details