ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్యాక్ టు ద రూట్స్, ఐఏహెచ్వీ సంస్థ సభ్యులు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి మూడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల(Oxygen Consentrators)ను అందజేశారు. ఆ సంస్థల సేవా దృక్పథాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అన్నా రాంబాబు కొనియాడారు. ఆ సంస్థలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ఆర్ట్ లివింగ్ స్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్కు దన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వెంకటసుబ్బయ్య, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూరిబాబు పాల్గొన్నారు.
Oxygen Consentrators: ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వితరణ - oxyzen concentraters distribution news
స్థానిక కొవిడ్ కేర్ సెంటర్కు ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐహెచ్ ఏవీ, బ్యాక్ టు ది రూట్స్ వ్యవస్థాపకులు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల(Oxygen Consentrators)ను అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. ఆయన చేతుల మీదుగా సంస్థ సభ్యులు 3 కాన్సన్ట్రేటర్లను వితరణగా ఇచ్చారు.
OXYGEN CONSENTRATORS DISTRIBUTION