ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్యోగం నుంచి తొలగించారన్న మనస్తాపంతో ఓ ఒప్పంద ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో తేళ్ల ప్రసాద్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ రోజు అధికారులు అతన్ని పనిలోకి రావొద్దన్నారు. మనస్తాపానికి గురైన అతను పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గత కాంట్రాక్టర్ వద్ద ప్రసాద్ పనిచేసేవాడని.. కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ ఇచ్చిన లిస్టులో అతని పేరు లేదని అందుకే పనిలోకి తీసుకోలేదని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు.
పనిలోకి రావొద్దన్నారని ఒప్పంద ఉద్యోగి ఆత్మహత్యాయత్నం - చీరాలలో ఒప్పంద ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్యోగం నుంచి తొలగించారన్న మనస్తాపంతో ఓ ఒప్పంద ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనను పనిలోకి తీసుకోలేదని పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.

ఒప్పంద ఉద్యోగి ఆత్మహత్యాయత్నం