ప్రకాశం జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 2 అద్దంకి నియోజకవర్గానికి చెందినవేనని అధికారులు వెల్లడించారు. సంతమాగులూరు, కొరిసపాడు మండలం పమిడిపాడు శివార్లలోని కనగారివారి పాలేనికి చెందిన వారికి వైరస్ సోకినట్టు గుర్తించారు. బాధితులిద్దరూ చెన్నై నుంచి వచ్చిన వారేనని తెలిపారు.
ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు.. కరోనా సోకిన వారితో ఇన్ని రోజులుగా కాంటాక్ట్ లో ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. వారికి పరీక్షలు చేసి అనుమానితులను క్వారంటైన్ కు పంపించాలని నిర్ణయించారు.