దేశ రాజధాని దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దుతుగా ప్రజా సంఘాలు, అన్ని విపక్షాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో ఎడ్ల బండ్లతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ.. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. రెండు నెలలుగా రైతు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ధర్నాలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రైతులకు మద్దతు.. జిల్లాలో ప్రజాసంఘాలు, విపక్షాల నిరసనలు - ప్రకాశం జిల్లా వార్తలు
దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా.. ప్రకాశం జిల్లాలో ప్రజా సంఘాలు, విపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు చేకూర్చే చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

దిల్లీలో రైతు ధర్నాకు మద్దతుగా ప్రకాశంలో ప్రజాసంఘాలు, విపక్షాల నిరసనలు