బడి ఈడు పిల్లలు చదువులకు పరిమితం కావాలని పనులకు కాదని ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్.ఐ శివకుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ సిద్దార్డ్ కౌశల్ ఉత్తర్వుల మేరకు మార్టూరులో ఎస్ఐ శివకుమార్, సిబ్బంది ఆధ్వర్యంలో చిన్న చిన్న దుకాణాల్లో పని చేస్తున్న పిల్లలను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. చదువుకోవాలే తప్ప పనులు చేయకూడదని పిల్లలకు హితబోధ చేశారు. వారికి అల్పాహారం అందించారు.ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతుందని ఎస్.ఐ శివకుమార్ తెలిపారు.
మార్టూరులో ఆపరేషన్ ముస్కాన్ - Operation Muskan News in Prakasam District
ప్రకాశం జిల్లా మార్టురులో ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా వివిధ దుకాణాల్లో పనిచేసే చిన్నారులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. వారికి చదువు విలువ గురించి తెలియచేశారు. పిల్లలు బడికే పోవాలి తప్ప పనులు చేయకూడదని ఎస్ ఐ శివకూమార్ తెలిపారు.
మార్టూరులో ఆపరేషన్ ముస్కాన్