చీరాల పట్టణ పరిపాలనను తీర్చిదిద్దేందుకు ఒక అడుగు ముందుకేశామని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ పేర్కొన్నారు. పట్టణంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. అపహరణకు గురైన ఆరేళ్ల చిన్నారి శ్రీలక్ష్మి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, సీఐ నాగమల్లేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
చీరాలలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ - sp siddardh kowshal latest news update
ప్రకాశం జిల్లా చీరాలలో రోజు రోజుకు జఠిలమవుతున్న ట్రాఫిక్ సమస్య అధిగమించేందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ విభాగాన్ని ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ విభాగాన్ని ప్రారంభించిన ఆయన స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
![చీరాలలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ Opening the traffic section at chirala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6230845-1062-6230845-1582873880276.jpg)
చీరాల పట్టణ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ విభాగాన్ని ప్రారంభించిన ఎస్పీ
చీరాల పట్టణ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ విభాగాన్ని ప్రారంభించిన ఎస్పీ
ఇవీ చూడండి...