చూస్తుంటే బాక్సింగ్‌లా ఉంది. కానీ, వీరు మాత్రం కుస్తీలా పోటీపడుతున్నారు. ఇంతకు ఇదేం ఆట అనుకుంటున్నారా ? ఈ క్రీడ పేరు పెన్‌కాక్ సిలాట్. మార్షల్ ఆర్ట్స్‌లో ఓ భాగం. ఇండోనేషియాలో బాగా ఆదరణ పొందుతున్న ఈ క్రీడలో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ పతకాలు సాధిస్తున్నారు ప్రకాశం జిల్లా యువ క్రీడాకారులు.
వాస్తవానికి ఈ క్రీడ చిత్తూరు- తమిళనాడు సరిహద్దుల్లో అప్పట్లో బాగా ప్రాచుర్యంలో ఉండేది. కాలక్రమేణ మన దగ్గర అంతరించిపోయినప్పటికీ.. మిగతా దక్షిణాసియా దేశాల్లో బాగా ఆదరణ దక్కించుకుంటోంది. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా గుర్తింపు లభిస్తున్న ఈ క్రీడలో యువతను ప్రొత్సాహించేలా పెన్‌కాక్ సిలాట్ అసోసియేషన్ కృషి చేస్తోంది. అందులో భాగంగా.. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొంత మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
ఒంగోలుకు చెందిన మనోజ్ సాయి వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడున్న వారిలో కొందరు రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ చాటుతూ.. పతకాలు సాధిస్తున్నారు. మూడేళ్ళ క్రితం అమృత్ సర్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో 60 మంది క్రీడాకారులు తెలుగురాష్ట్రాలనుంచి పాల్గొన్నారు. అందులో ఒంగోలుకు చెందిన క్రీడాకారులు 7 బంగారు పతకాలు సాధించగా, మరో 8 మంది ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు.
అంతర్జాతీయ పోటీల్లోనూ..