ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంగోలులో 'జైల్​భరో'కు తెదేపా మద్దతు..నేతల అరెస్ట్ - ఒంగోలు తెదేపా పార్లమెటరీ ఇంఛార్జ్ అరెస్ట్

అమరావతి రైతులకు మద్ధతుగా రాష్ట్రవ్యాప్తంగా జైల్​భరో నిర్వహిస్తున్న తెదేపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిరసన చేపడుతున్న.. ఆ పార్టీ పార్లమెంట్ ఇంఛార్జ్ నుకశాని బాలాజీని అరెస్ట్ చేశారు.

jail baro in ongole
ఒంగోలులో జైల్​బరో

By

Published : Oct 31, 2020, 4:49 PM IST

రైతులకు బేడీలు వేసి అవమానించారని.. న్యాయం కోసం పోరాడితే అణగదొక్కుతున్నారని తెదేపా ఒంగోలు పార్లమెంట్ ఇంఛార్జ్ నుకశాని బాలాజీ మండిపడ్డారు. అమరావతి రైతులపై ప్రభుత్వ దౌర్జన్యానికి వ్యతిరేకంగా.. ప్రకాశం జిల్లా ఒంగోలు తెదేపా కార్యాలయంలో జైల్​భరో నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేయగా.. పోలీసులకు వ్యతిరేకంగా పలువురు నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details