ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తమ్మడపల్లెలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన.. గుమ్నా గంగరాజు అనే రైతును తెదేపా నాయకులు పరామర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆదేశాలతో.. జిల్లా నేతలు రైతు ఇంటికి వెళ్లారు. ముప్పై ఏళ్లుగా భూమి సాగుచేసుకుంటున్న గంగరాజును ఇబ్బందులకు గురిచేయడం దారుణమని ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షులు నుకసాని బాలాజీ పేర్కొన్నారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ సిబ్బంది సఖ్యతగా మసులుకోకుంటే.. రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బడుగు, బలహీన వర్గాల జోలికొస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. రెండు రోజుల్లో గంగరాజుకు న్యాయం చేయకపోతే.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేపడతామని స్పష్టం చేశారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతుకు తెదేపా నేతల పరామర్శ - tdp leaders went to tammadapalle farmer house
సాగుభూమి విషయంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తమ్మడపల్లె రైతు గంగరాజును తెదేపా నేతలు పరామర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆదేశాలతో.. అతడి ఇంటికి వెళ్లి ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. అధికారులు, పోలీసులు.. వైకాపా ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు మండిపడ్డారు.
వైకాపా నేతలు, అధికారుల తీరును నిరసిస్తూ.. తనకుతానే బండరాయితో కొట్టుకొని ఆ రైతు నిన్న గాయపరుచుకున్నాడు. ముప్పై ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని వైకాపాకు చెందిన మాజీ ఎంపీపీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి.. అధికారుల అండతో ఆక్రమించుకున్నాడని బాధితుడు ఆరోపించాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. ఆ భూమిని పరిశీలించేందుకు తహసీల్దార్ ఉమారాణి పొలం వద్దకు వచ్చారు. అధికారులు, పోలీసులు సైతం వైకాపా నేతకు పత్తాసు పలకడంతో.. మనస్తాపానికి గురై పురుగుమందు తాగబోయాడు. సిబ్బంది అడ్డుకోవడంతో పక్కనే ఉన్న బండరాయితో కొట్టుకున్నాడు.
ఇదీ చదవండి:తన భూమి వైకాపా నేత ఆక్రమించారని రైతు ఆత్మహత్యాయత్నం..!