ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త కోసం భార్య.. తండ్రి కొరకు కూతురు ప్రచారం - election campaign

ఒంగోలులో అభ్యర్థుల తరఫున కుటుంబ సభ్యులు ప్రచార బరిలోకి దిగారు. ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల సతీమణి,.. ఎంపీ అభ్యర్థి శిద్దా రాఘవరావు కూతురు ఇద్దరూ కలిసి తమ వారి తరఫున ప్రచారం చేస్తున్నారు.

ప్రచారంలో నాగ సత్యలత, సునీత

By

Published : Mar 27, 2019, 9:08 PM IST

నాగ సత్యలత, సునీత ప్రచారం
ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచార ముమ్మరం చేసింది. అభ్యర్థులకు సాయంగా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెదేపాని గెలుపించాలని కోరుతూ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గ తెదేపా అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ భార్య నాగ సత్యలత, పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మంత్రి శిద్దా రాఘవరావు కూతురు మన్యం సునీతతో కలిసి పట్టణంలోని మిర్యాలపాలెంలో పర్యటించారు. మహిళలని, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి సైకిల్​ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details