ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్త మార్కెట్ ప్రక్కన ఉన్న ముస్లిం మైనారిటీ షాదీఖాన భవనాన్ని పూర్తి చేయాలని ముస్లింలు కోరుతున్నారు. నగర పాలక సంస్థ సంబంధించిన సుమారు రూ. 75 కోట్లు విలువ చేసే స్థలంలో ముస్లిం మైనారిటీలకు సంబంధించిన షాదీఖాన నిర్మాణానికి పనులు ప్రారంభించారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థు కోసం సమారు 3 నుంచి 5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టారు.
అసంపూర్తిగా ఒంగోలు షాదీఖానా భవనం - ఒంగోలు షాదీఖానా భవనంపై వార్తలు
ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్త మార్కెట్ ప్రక్కన ఉన్న ముస్లిం మైనారిటీ షాదీఖాన వెంటనే పూర్తి చేయాలని ముస్లింలు కోరుతున్నారు. త్వరగా అందరికి అందుబాటులోకి తీసుకురావాలని ముస్లిం మైనారిటీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
![అసంపూర్తిగా ఒంగోలు షాదీఖానా భవనం Ongole shadhikana building in incomplete position](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8722694-570-8722694-1599550383324.jpg)
షాదీఖాన గ్రౌండ్ ఫ్లోర్ కోసం 2 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం ప్రారంభించారు. పైఅంతస్థు పిల్లర్లు పూర్తై పనులు ఆగిపోయాయి. 18 నెలలు గడుస్తున్నా ఆగిన పనులు ప్రారంభం కాలేదు. షాదిఖానా కాంపౌండ్ లోపల నాలుగు వైపుల ముళ్ళ చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. కొన్ని రోజులు ఇలాగే వదిలేస్తే భవనం శిథిలావస్థకు చేరుకుంటుందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీ నివాసులు రెడ్డి స్పందించి షాదీఖాన పూర్తి చేయాలని నగర ముస్లింలు కోరుతున్నారు.