ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగర శివారులో 32 కాలనీలు(colonies) ఉన్నాయి. ఒంగోలు జనాభాలో సగం ఈ కాలనీల్లోనే నివాసముంటున్నారు. రాజీవ్ కాలనీ, ఇందిరా కాలనీ, బలరాం కాలనీ, కేశవరాజుకుంట, చినమల్లేశ్వర కాలనీ, వెంకటేశ్వర కాలనీ, నాగేంద్రనగర్, విరాట్ నగర్ తదితర కాలనీల్లో జనాభా(population) పెరుగుతున్నా కనీస సౌకర్యాలు మాత్రం లేవు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ లేక శివారు కాలనీల పరిస్థితి దారుణంగా తయారైంది.
రోడ్లపైనే మురుగునీరు...
మురుగునీరు(drinage water) వెళ్లే దారిలేక రోడ్లపైనే నిలిచిపోయి దోమల వ్యాప్తి ఎక్కువైపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిస్తే ఇళ్ల ముందు నీరు నిలిచి, బయటకు రాలేని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. కాలనీల్లోని పాఠశాలల పరిస్థితి అలానే ఉంది. పాఠశాలకు రక్షణ గోడలు(walls) నిర్మించలేదు. మురుగు దొడ్లు(toilets) వంటివి ఏర్పాటు చేయకపోవడం వల్ల విద్యార్థులు(students) తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.