ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరుగుడు మొక్కల పెంపకంపై కుదరని సయోధ్య.. కొనసాగుతున్న 144 సెక్షన్

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలోని సముద్ర తీరంలో పోలీసుల 144 వ సెక్షన్ కొనసాగుతూనే ఉంది. సముద్ర తీరం వెంబడి సరుగుడు మొక్కల పెంపకంపై రామాపురం, కఠారి వారిపాలెం గ్రామాల మధ్య ఇప్పటికీ సయోధ్య కుదరట్లేదు.

ongoing-section-144-in-vetapalam-zone-of-prakasam-district
సరుగుడు మొక్కల పెంపకంపై కుదరని సయోధ్య.. కొనసాగుతున్న 144 సెక్షన్

By

Published : Sep 12, 2021, 9:33 AM IST

మొక్కల పెంపకంపై రెండు మత్స్యకార గ్రామాల్లో సయోధ్య కుదరకపోవటంతో ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలోని సముద్ర తీరంలో పోలీసుల 144 వ సెక్షన్ కొనసాగుతూనే ఉంది. సముద్ర తీరం వెంబడి సరుగుడు మొక్కల పెంపకం పై వేటపాలెం మండలం రామాపురం, కఠారి వారిపాలెంల మధ్య ఇంకా సయోద్య కుదరలేదు. ఈ విషయమై గత నాలుగురోజుల క్రితం రెండు గ్రామాల మత్స్యకారుల మధ్య వివాదం నెలకొంది. దీంతో పోలీసులు 144 వ సెక్షన్ విధించి రెండు గ్రామాల్లో పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటుచేశారు.

వివాదాస్పద భూమిలో అధికారులు బోర్డులు పెట్టారు. రెండు రోజుల్లో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని లేకపోతే.. ప్రభుత్వ భూమిని వెనక్కు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈమేరకు ఇరు పక్షాల పెద్దలు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. సమస్య సర్దుమణిగే వరకు రెండు గ్రామాల్లో పోలీసుల బందోబస్తు కొనసాగుతూనే ఉంటుందని చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్ తెలిపారు.

ఇదీ చూడండి:ఆ బామ్మ వయసు 60 కాదండోయ్.. పదహారే!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details