ప్రకాశంజిల్లా చీరాలలో మత్స్యకారుల గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. చేపల వలల విషయంలో ఈనెల 11వ తేదీన కటారివారిపాలెం, రామాపురం ప్రాంతాలకు చెందినవారు వాడరేవు వాసులపై దాడి చేశారు. ఈ ఘటనలో 20 మంది వరకు వాడరేవు మత్స్యకారులు గాయపడ్డారు. దాడుల్లో పలు దుకాణాలు, వస్తువులు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కటారివారిపాలెంకు చెందిన పదహారు మందిని అరెస్ట్ చేశారు.
చీరాలలో మత్స్యకారుల గ్రామాల్లో కొనసాగుతున్న పోలీస్ పికెటింగ్ - Conflict in fishing villages news
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని ఘర్షణ జరిగిన మత్స్యకారుల గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. దాడికి పాల్పడిన కటారిపాలెం వాసులను పదహారు మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
చీరాలలో పోలీస్ పికెటింగ్