ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలో ప్రమాదం.. ప్రైవేట్ విద్యార్థి దుర్మరణం.. ఏం జరిగింది? - prakasham district crime news

ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబ్‌ కూలి విద్యార్థి మృతి
ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబ్‌ కూలి విద్యార్థి మృతి

By

Published : Aug 29, 2021, 4:11 PM IST

Updated : Aug 29, 2021, 7:52 PM IST

16:09 August 29

మార్కాపురం మండలం రాజుపాలెం పాఠశాలలో ఘటన

ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబ్‌ కూలి.. ప్రైవేట్ పాఠశాల విద్యార్థి మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో ప్రభుత్వ పాఠశాల భవనం శ్లాబ్‌ కూలిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ప్రైవేట్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విష్ణు.. ఆదివారం కావడంతో గ్రామంలోని స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదం జరిగింది. విష్ణు మృతితో వారి కుటుంబసభ్యులు తీవ్ర వేదనలో మునిగిపోయారు. కడుపుకోత తీర్చేదెవరంటూ రోదించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనానికి మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని.. నిర్లక్ష్యం వల్లే ఇవాళ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు అంటున్నారు.

 మంత్రి ఆదిమూలపు సురేశ్ దిగ్భ్రాంతి..

పాఠశాల స్లాబ్ పడి విద్యార్థి మరణించిన ఘటనపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలు కూల్చివేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మరణించిన బాలుడు ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థి అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

'ట్విట్టర్​లో సందేశాలే కాదు.. తెలుగు భాషాభివృద్ధికీ శ్రమించాలి'

Last Updated : Aug 29, 2021, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details