పరిశ్రమలు, పెట్టుబడులు అంశంపై జరిగిన మేధో సదస్సులో తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి పలు అంశాలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. జిల్లాకు సంబంధించిన రామయ్యపట్నం పోర్టు విషయంలో ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తుందని, ఇతర పారిశ్రామిక వాడల అభివృద్ధిలో గతంలో సంతృప్తికరమైన ప్రగతి సాధించలేదని, వీటి విషయంలో కూడా ప్రభుత్వం చొరవ చూపిస్తుందని రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, సురేష్‌లు పేర్కొన్నారు. రామయ్య పట్నం పోర్టు కోసం 2141 ఎకరాల్లో డీపీఆర్ తయారైందని, కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో 100 ఎకరాల్లో పారిశ్రామిక వాడలు నిర్మిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
నియోజకవర్గానికో పారిశ్రామిక వాడ.... - cm jagan celabrations of on year ruling
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న స్పందన భవనంలో ఏడాది పాలన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆన్‌లైన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, సురేష్‌లు పలువురు అధికారులు పాల్గొన్నారు.
మా పాలన మీ సూచన కార్యక్రమంలో మంత్రులు