బ్లాక్ ఫంగస్ వ్యాధితో ప్రకాశం జిల్లా చీరాల మండలంలో ఒక మహిళ మృతి చెందింది. దీంతో చీరాలలో రెండో బ్లాక్ ఫంగస్ మృతి నమోదైంది. చీరాల మండలం గవినివారిపాలెంకు చెందిన ఎం. బ్రహ్మేశ్వరి(35) ఏప్రిల్ నెలలో కరోనా బారిన పడి చీరాలలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంది. కొన్నిరోజుల తరువాత ఆమె ముక్కు, మొహం వాయడంతో మరలా అదే వైద్యశాలకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్దారించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటినుంచి చికిత్స పొందుతూ ఆదివారం బ్రహ్మేశ్వరి మృతి చెందింది. బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందటంతో గ్రామస్థుల్లో భయాందోళన నెలకొంది.
చీరాల మండలంలో బ్లాక్ ఫంగస్‌తో మరో మహిళ మృతి - చీరాలలో బ్లాక్ ఫంగస్
ప్రకాశం జిల్లా చీరాల మండలంలో బ్లాక్ ఫంగస్‌తో మరో మహిళ మృతి చెందింది. దీంతో చీరాలలో రెండో బ్లాక్ ఫంగస్ మృతి నమోదైంది.
చీరాల మండలంలో బ్లాక్ ఫంగస్‌తో మరో మహిళ మృతి