ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం... ఒకరు మృతి - ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు

ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు పక్క రాష్ట్రానికి వచ్చిన వారికి విషాదం మిగిలింది. రోడ్డు ప్రమాదం ఒకరిని బలిగొంది. నలుగురిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

road accident at Machavaram village in pamur mandal
road accident at Machavaram village in pamur mandal

By

Published : Aug 14, 2020, 12:52 AM IST

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మాచవరం గ్రామం వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుపాన్ వాహనం, డీసీఎం లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందారు.

తెలంగాణలోని నిజామాబాద్​కు చెందిన మండ్లా మాల్యాద్రి, షేక్ ఖాసిం కుటుంబ సభ్యులు కనిగిరి నియోజకవర్గంలోని పామూరు మండలం తిరగాలదిన్నె గ్రామంలో వివాహ శుభకార్యానికి తుపాన్ వాహనంలో బయలుదేరారు. పామూరు నుంచి సవక కర్రల లోడుతో కనిగిరి వైపు వస్తున్న డీసీఎం లారీ... మాచవరం గ్రామం వద్ద తుపాన్ వాహనాన్ని ఢీ కొట్టింది. తుపాన్ వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మండ్లా మాల్యాద్రి(48) సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details