2 లారీలు ఢీ...ఒకరు మృతి - undefined
గిద్దలూరు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందారు.
![2 లారీలు ఢీ...ఒకరు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3928331-789-3928331-1563933272440.jpg)
2 లారీలు ఢీ...ఒకరు మృతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుంచి శెనగల లోడుతో గుత్తి వెళ్తున్న లారీ... నంద్యాల నుంచి చిలకలూరిపేటకి మరో లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో శనగలతో వెళ్తు్న లారీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో లారీ క్యాబిన్లో చిక్కుకుని డ్రైవర్ మృతి చెందగా...మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
2 లారీలు ఢీ...ఒకరు మృతి