Minister Suresh vehicle accident in gobburu : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కేటాయించిన ప్రభుత్వ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మార్కాపురం పట్టణానికి చెందిన మహేశ్, ఆయన భార్య ద్విచక్రవాహనంపై దుప్పట్లు అమ్ముకునేందుకు వెళుతున్నారు. ఆ సమయంలో మార్కాపురం వస్తున్న మంత్రికి కేటాయించిన కారు... ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
Minister Suresh Vehicle Accident: బైక్‌ను ఢీకొట్టిన మంత్రి సురేశ్ వాహనం.. ఒకరు మృతి - prakasam district
Minister Suresh vehicle accident in gobburu : మంత్రి సురేశ్‌కు కేటాయించిన ప్రభుత్వ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రకాశం జిల్లా గొబ్బూరులో జరిగిన ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతుల్లో భర్త మృతి చెందాడు.
బైక్‌ను ఢీకొట్టిన మంత్రి సురేశ్ వాహనం.. ఒకరు మృతి
చికిత్స నిమిత్తం బాధితురాలని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యంకోసం కర్నూలు తరలించారు. ప్రమాద సమయంలో మంత్రి సురేశ్ మార్కాపురంలోని ఆయన స్వగృహంలో ఉన్నారు. డ్రైవర్ రాత్రి తన ఊరు యర్రగొండపాలెం వెళ్లి ఉదయం తిరిగి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదీచదవండి.
Last Updated : Dec 9, 2021, 11:30 AM IST