ఒంగోలులో ఓ కానిస్టేబుల్ బాగా మద్యం తాగి, ద్విచక్రవానంపై వెళ్తూ.. రోడ్డు దాటుతున్న ఓ పండ్ల వ్యాపారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో పండ్ల వ్యాపారి తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది.
accident : మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం.. బైక్‌తో ఢీకొట్టడంతో ఒకరి మృతి! - accident in ongole
మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. పూటుగా మద్యం తాగి ద్విచక్రవాహనం నడిపాడు. ఈ క్రమంలో రోడ్డుదాటుతున్న వ్యక్తిని ఢీకొట్టి, నిండు ప్రాణం పోవడానికి కారకుయ్యాడు. ఈ ఘటన ఒంగోలులో జరిగింది.
మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం
మృతుడి కుటుంబ సభ్యులు.. ఘటనకు కారకుడైన కానిస్టేబుల్ శివకృష్ణకు దేహశుద్ధి చేశారు. కానిస్టేబుల్ శివకృష్ణపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ డీఎస్పీ నాగరాజు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా.. యువకుడి మృతికి కారణమైన ఏఆర్ కానిస్టేబుల్ శివకృష్ణను సస్పెండ్ చేస్తూ.. ఎస్పీ గార్గ్ ఆదేశాలు జారీచేశారు.
ఇవీచదవండి :