ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు - ప్రకాశం జిల్లా వార్తలు

ప్రకాశం జిల్లా కోలలపూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపతప్పి కిందపడిన వ్యక్తుల పైనుంచి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి.

one man death and two men injured in a road accident in kolalapoodi prakasam district
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ

By

Published : Jun 20, 2020, 4:11 PM IST

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోలలపూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని వాహనదారులు అదుపుతప్పి కిందపడ్డారు. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న ట్రాక్టర్.. కిందపడ్డ వారి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details