శుక్రవారం సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురం తీరంలో లభ్యమైంది. చీరాలలోని హరిప్రసాద్ నగర్‌కు చెందిన 15 మంది వాడరేవు వద్ద సముద్ర స్నానానికి వెళ్లారు.
ఒక్కసారిగా అలలు తాకిడి ఎక్కువ కావటంతో ఎస్.విజయ్ బాబు (17), పి. సాయి (17) గల్లంతయ్యారు. అనంతరం రామాపురం సముద్ర తీరానికి విజయ్ బాబు మృతదేహం కొట్టుకొచ్చింది. మరో యువకుడు సాయి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు.