ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో... అక్కడికక్కడే ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు.
మృతుడిని దొనకొండ మండలానికి చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు త్రిపురాంతకం ఎస్సై వెంకట కృష్ణయ్య తెలిపారు.