SARPANCH PROTEST : పంచాయతీ నిధులు లేక గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయిందంటూ.. ఓ సర్పంచ్.. వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఆర్థిక సంఘం నిధులను సైతం ప్రభుత్వం కాజేయడంతో.. విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం ఒమ్మెవరానికి చెందిన బాలకోటి.. తెలుగుదేశం పార్టీ తరుపున గెలుపొందాడు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లయినా.. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నానని నిట్టూరుస్తున్నారు. తనను క్షమించాలంటూ.. జోలె పట్టి ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తూ పరిస్థితిని వివరిస్తున్నాడు.
నన్ను క్షమించండమ్మా..! అంటూ, ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తున్న సర్పంచ్ - భిక్షాటన చేస్తూ సర్పంచ్ నిరసన
SARPANCH PROTEST IN PRAKASAM : నిధులు లేక.. విధులు నిర్వహించలేక.. ఉత్సహ విగ్రహాల్లా మిగిలామని, పనులు చేయనందుకు తమను క్షమించాలంటూ ఓ సర్పంచ్ వినూత్నంగా నిరసన చేపట్టాడు. ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం ఒమ్మెవరం సర్పంచ్ ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తూ, తన పరిస్థితిని వివరిస్తున్నాడు.
SARPANCH PROTEST
Last Updated : Dec 10, 2022, 11:11 AM IST