Old Women Murder: సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో మంగళవారం ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. ఆస్తి వివాదాలే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై శివన్నారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పాలెపు సుబ్బమ్మ (64), హరిరావు అలియాస్ హరిబాబు దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు రమాదేవి, సుజాత. తరువాత హరిబాబు మరో వివాహం చేసుకుని ప్రస్తుతం ద్రోణాదులలో ఉంటున్నారు. ఈ క్రమంలో సుబ్బమ్మ తన తమ్ముడు కోటేశ్వరరావుకు పెద్ద కుమార్తె రమాదేవిని ఇచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు మగ పిల్లలు. రెండో కుమార్తె సుజాతను చిలకలూరిపేటకు చెందిన గోనెపూడి బ్రహ్మయ్యతో వివాహం జరిపించింది. పిల్లల చదువు నిమిత్తం రమాదేవి కుటుంబం చిలకలూరిపేటలో ఉండగా సుబ్బమ్మ పాడి పోషణ సాగిస్తూ గురిజేపల్లిలోనే ఉంటోంది. ఆమె పేరిట ఉన్న 2.15 ఎకరాల వ్యవసాయ భూమిని.. రమాదేవి కుమారుడి పేరిట గత ఏడాది రిజిస్ట్రేషన్ చేసింది. ఈ విషయమై సుజాత, బ్రహ్మయ్య దంపతులు అభ్యంతరం తెలిపి గొడవపడ్డారు. దీంతో సుబ్బమ్మ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు భూమి విషయమై అద్దంకి కోర్టులో దావా వేశారు. కాగా మంగళవారం సుబ్బమ్మ హత్యకు గురైంది. మెడకు పసుపు తాడు బిగించి ఉంది. రెండు చెవుల నుంచి రక్తం కారిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆస్తి కోసం సుజాత దంపతులే.. తల్లిని హత్య చేసి ఉంటారని రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Old Women Murder: ప్రకాశం జిల్లాలో వృద్దురాలి హత్య.. ఆస్తి కోసమేనా? - prakasham district news
Old Women Murder: ప్రకాశం జిల్లాలో ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. ఆస్తి వివాదాల నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వృద్ధురాలు హత్యకు గురికావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/16-February-2022/14479682_mm.jpghttp://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/16-February-2022/14479682_mm.jpg