అవసానదశలో ఉన్న ఆ వృద్ధులకు ఆధార్ కార్డు కోసం అగచాట్లు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ దారుల ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ తప్పనిసరి చేయటంతో... ఆధార్ కేంద్రాలన్ని రద్దీగా మారాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని తపాలా శాఖా కార్యాలయం వద్ద వృద్ధులు తెల్లవారుజామున నుంచే నిరీక్షిస్తున్నారు. మరోవైపు ఆధార్ నిర్వాహకులు మాత్రం రోజుకు ఇరవై మందికి మాత్రమే టోకెన్లు జారీచేసి సరిపుచ్చుతున్నారు. దీంతో రోజూ వచ్చి వెళ్లవలసి వస్తోందని వారు వాపోతున్నారు. అధికారులైనా చొరవ తీసుకొని తమ సమస్యను పరిష్కారిచండి అని వేడుకున్నారు.
ఆధార్ కార్డు అనుసంధానం కోసం వృద్ధుల అగచాట్లు - latest news in prakasam
ఆధార్ కార్డుకు చరవాణి సంఖ్య అనుసంధానించటం కోసం వృద్ధులకు అగచాట్లు తప్పడం లేదు. తెల్లవారుజాము నుంచే తపాలా శాఖా కార్యాలయం వద్ద క్యూలో నిరీక్షిస్తున్నారు.
ఆధార్ కార్డు అనుసంధానం కోసం వృద్ధుల అగచాట్లు