GUNDLAKAMMA PROJECT : ప్రకాశం జిల్లాలో కీలకమైన గుండ్లకమ్మ జలాశయం ఒక్కసారిగా ఖాళీ అయింది. గతనెల 31 వరకు మూడు టీఎంసీలతో ఇది నిండుకుండను తలపించింది. తాజాగా మూడో గేటు దెబ్బతినడం, దానికి మరమ్మతు కోసం శుక్రవారం 13, 14, 15 గేట్లు, శనివారం 11, 12 గేట్లు ఎత్తి నీరు దిగువకు వదిలేయడంతో ఇప్పుడు కేవలం 0.516 టీఎంసీలే మిగిలాయి. అయినా మరమ్మతు సాధ్యం కాలేదు. ఆదివారం పనులు ప్రారంభిస్తామని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
గుండ్లకమ్మ స్పిల్‌వే ప్రమాదంలో ఉన్నట్లు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పది గేట్లు ఇబ్బందికరంగా ఉన్నాయని, పనులు చేయాల్సి ఉందని మంత్రి అంబటి రాంబాబు చెప్పడం.. నీరంతా వృథాగా వదిలిపెట్టడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఖరీఫ్ సాగుతో పాటు 82 గ్రామాల తాగు నీటికి అవసరమైన జలమంతా గేటు పగిలిపోయి సముద్రం పాలైంది. ఇప్పటి వరకు 25 వేల క్యూసెక్కులు సముద్రంలో కలిసిందని అధికారుల అంచనా.