పట్టణంలో పూర్తిగా రాకపోకలను నిషేధించినా, లాక్ డౌన్ సమయంలో కూడా ఆయా ప్రాంతాల్లో కొంతమంది దుకాణాలు తెరిచివుంచడం, సమాచార సేకరణకు వెళ్ళే సర్వే బృందాలకు ఆ ప్రాంత వాసులు సహకరించకపోవడంతో అధికారులు పర్యటించి కాలనీవాసులకు కౌన్సిలింగ్ ఇప్పించారు. కరోనా వైరస్ విస్తరిస్తోన్న కారణంగా స్వయం నిర్బంధం పాటించాలని అధికారులు కోరారు. మున్సిపల్ మార్కెట్‌లో సమీపంలో సోడియం హైడ్రో క్లోరేడ్ పిచికారి చేసే ద్వారాన్ని అధికారులు ఏర్పాటు చేసారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేతులు శుభ్రపరుచుకునేందుకు ఏర్పాట్లు చేసారు. రెడ్ జోన్ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖాధికారి వెంకటేశ్వరరావు, పోలీసులు, రెవెన్యూ అధికారులు పర్యటించారు.
ఒంగోలు రెడ్ జోన్ ప్రాంతాల వారికి అధికారుల కౌన్సిలింగ్ - undefined
ఒంగోలు పట్టణంలో రెడ్ జోన్ ప్రాంతంలో అధికారులు బృందం పర్యటించారు. ఇస్లాం పేట, బండ్ల మెట్ట, కొండమెట్ట, పేర్ల మాన్యం, ఇందిరమ్మ కాలని ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ఈ ప్రాంతాలను అధికారులు అష్టదిగ్భంధం చేసారు.
ఒంగోలు రెడ్ జోన్ ప్రాంతాల వారికి అధికారుల కౌన్సిలింగ్