ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ నేత గనుల లీజులో అక్రమాలు-సక్రమమని చూపేందుకు అధికారుల యత్నాలు Officer Permission To Illegal Granite Mining :ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని వైఎస్సార్సీపీ కీలక నేత ఆధీనంలోని ఓ గ్రానైట్ లీజు వ్యవహారంలో అధికారుల ఉదాసీనత మరోసారి చర్చనీయాంశంగా మారింది. లీజులో అక్రమాలు జరిగినట్లు తేలినా వాళ్ల నుంచి జరిమానాలు సహా మొత్తం సొమ్ము వసూలు చేయకుండా చేష్టలుడిగి చూడటమే కాకుండా మరింతలా తవ్వకాలకు అనుమతులు ఇచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
Illegal Granite Mining Under YSRCP Leaders :ప్రభుత్వానికి కోట్లలో నష్టం జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా లీజు నిర్వాహకుడు వైఎస్సార్సీపీ నేత కావడంతో ఉల్లంఘనలను ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. చీమకుర్తి మండలం ఆర్‌ఎల్ పురంలో సర్వే నంబరు 55/6లో గోల్డెన్ గ్రానైట్స్ కంపెనీ పేరిట లీజు ఉంది. దీనిని దాదాపు 2 దశాబ్దాలుగా వైఎస్సార్సీపీ నేత కుటుంబానికి చెందిన సిద్ధా లక్ష్మీపద్మావతి కాంట్రాక్టర్స్ రైజింగ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ లీజు మేరకు ఏడాదికి 23,799 క్యూబిక్ మీటర్లు చొప్పున గ్రానైట్‌ను తవ్వి, తరలించేందుకు గతంలో రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ నుంచి పర్యావరణ అనుమతులు పొందారు. ఓ ఏడాది మాత్రం పర్యావరణ అనుమతులకు మించి 9,098 క్యూబిక్ మీటర్లతో కలిపి మొత్తంగా 32,897 క్యూబిక్‌మీటర్ల మేర గ్రానైట్‌ను ఆ లీజు ద్వారా తరలించారు.
గ్రానైట్ మాఫియా అక్రమాలు.. పన్నులు ఎగ్గొట్టి తరలింపు..
YSRCP Leader Granite Mining At Prakasam District :పరిమితికి మించి గ్రానైట్‌ను తరలిస్తే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మరింతలా తవ్వకాలకు అనుమతులిస్తున్నారు. గతంలో ఏడాదికి 23,799 క్యూబిక్ మీటర్లు గ్రానైట్ తవ్వి తరలించే అనుమతి ఉండగా, ఏటా 40,585 క్యూబిక్ మీటర్లు తవ్వుకునేందుకు కొన్నేళ్ల కిందట సియా అనుమతులు ఇచ్చింది. ఈసీ అనుమతులకు మించి తవ్వారనే విషయం తెలిసినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా అదనపు తవ్వకాలకు మార్గం సుగమం చేశారు. తాజాగా 2022-23 నుంచి మళ్లీ ఏటా 40,585 క్యూబిక్ మీటర్లు తవ్వి, తరలించుకునేలా గత ఏడాది మార్చి 25న సీయా ఉత్తర్వు జారీచేసింది. అక్కడి కీలక వైఎస్సార్సీపీ నేత ఆధీనంలో ఈ లీజు ఉండటంతో అక్రమాలను ఏ అధికారులూ పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
'గ్రానైట్ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి'
YSRCP Leaders Mining :గోల్డెన్ గ్రానైట్స్‌లో వైఎస్సార్సీపీ నేత దందాపై కర్నూలుకు చెందిన అశ్వద్ధనారాయణ నవంబర్ 10న లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. లీజులో తవ్విన ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ మార్కెట్ విలువ సగటున క్యూబిక్ మీటరుకు లక్ష వరకు ఉందని ఈ లెక్కన తరలించిన అదనపు గ్రానైట్ విలువ 90 కోట్లకుపైనే అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పర్మిట్లు ఎలా జారీ చేశారు. అదనంగా తవ్వకాలవిషయంలో ఏం జరిగింది. తప్పులు జరిగినా మళ్లీ పర్యావరణ అనుమతులు ఎలా ఇచ్చారు అనే వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ గనులశాఖను లోకాయుక్త ఆదేశించింది. ఈ లీజును వైఎస్సార్సీపీ నేత నిర్వహిస్తుండటంతో అందులోని అక్రమాలను సక్రమమని చూపేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
మురికిపూడిలో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు.. మంత్రి విడదల రజనికి నోటీసులు