ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. కేంద్రంలో కొవిడ్ రోగులకు అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా, భోజనంలో నాణ్యత లోపించినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. ధైర్యంగా ఉంటే కరోనా మహమ్మారిని జయించవచ్చని స్థానిక తహసీల్దార్ చెప్పారు. అనంతరం కేంద్రంలో అందజేస్తున్న భోజనాన్ని నగర పంచాయతీ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ రుచిచూశారు.
కొవిడ్ కేర్ కేంద్రం పరిశీలన... సౌకర్యాలపై ఆరా - covid care centre in prakasam district
ప్రకాశం జిల్లా కనిగిరి కొవిడ్ కేర్ కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్, నగరపంచాయతీ ఛైర్మన్ పరిశీలించారు. కేంద్రంలో రోగులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
ప్రకాశం జిల్లా కనిగిరి కొవిడ్ కేర్ కేంద్రం