ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినాయక నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు... గ్రామస్థుల ఆగ్రహం

ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ట్రాన్స్​జెండర్లు చేసిన అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. వినాయక నిమజ్జనం సందర్భంగా... ఏర్పాటు చేసిన వేడుకలో నగ్న నృత్యాలు చేయడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వినాయక నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు
వినాయక నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు

By

Published : Oct 4, 2021, 10:43 PM IST

ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో వినాయక నిమజ్జన కార్యక్రమం అశ్లీల నృత్యాలకు వేదికైంది. వినాయక నిమజ్జనంలో కమిటీ సభ్యులు.. ట్రాన్స్​జెండర్లతో నృత్యాలు చేయించారు. గ్రామంలో బహిరంగంగా ఇలా నృత్యాలు చేసినా.. పోలీసులు నియంత్రించలేదని గ్రామస్థులు ఆరోపించారు. దైవకార్యంలో అశ్లీల నృత్యాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నృత్యం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వినాయక నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు చేయడంపై కేసు పెట్టామని పోలీసులు తెలిపారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details