ప్రకాశం జిల్లా దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో జెండా ఏర్పాటు చేస్తుండగా.. విద్యుదాఘాతంతో తెదేపా కార్యకర్త మద్దినేని వెంకట నారాయణ మృతి చెందాడు. నారాయణ కుటుంబ సభ్యులను తెదేపా అధ్యక్షులు దామచర్ల జనార్ధన్, రమేష్ పలువురు తెదేపా నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
తెదేపా కార్యకర్త మృతుని కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భరోసా - TDP activist was electrocuted in Nimmareddypalem
దర్శి మండలం నిమ్మారెడ్డి గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో జెండా ఏర్పాటు చేస్తూ.. విద్యుదాఘాతంతో తెదేపా కార్యకర్త మృతి చెందాడు. మృతుడూ వెంకట నారాయణ కుటుంబాన్ని తెదేపా నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. మృతి చెందిన నారాయణ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వెంకట నారాయణ మృతదేహానికి తెదేపా జిల్లా పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్ధన్ పలువురు తెదేపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఘటనలో గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అన్ని విధాల కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మృతి చెందిన నారాయణ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంకట నారాయణ భార్యకు పమిడి రమేష్ రూ.50వేలు, తూర్పుగంగవరం తెదేపా నాయకుడు వల్లభనేని సుబ్బయ్య రూ. 10 వేల నగదును అందించారు. వెంకటనారాయణ ఇద్దరు పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యను అందిస్తామని ప్రకటించారు.