ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా ఎన్టీఆర్​ జయంతి - tribute to ntr

ప్రకాశం జల్లాలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 97వ జయంతి వేడుకలు తెదేపా నాయకులు ఘనంగా నిర్వహించారు.

praksam district
ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్​ జయంతి వేడుకలు

By

Published : May 28, 2020, 11:51 AM IST

ప్రకాశం జిల్లా అద్దంకి, చీరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 97వ జయంతి వేడుకలు నిర్వహించారు. అద్దంకి పట్టణంలోని 10వ వార్డులో 300 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు.

చీరాల ఆర్టీసీ బస్ స్టాండు కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి.. నియోజకవర్గ భాద్యుడు యడం బాలాజీ, తెదేపా నాయకుడు గొడుగుల గంగరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యడం బాలాజీ కేక్ కోసి, మిఠాయిలు పంచిపెట్టారు. బడుగు బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details