ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అన్నగారిపై అభిమానం... మార్చాడు బుల్లెట్​ అవతారం' - story on ntr fan at prakasham

సీనియర్​ ఎన్టీఆర్​ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు... నందమూరి కుటుంబం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఈ అభిమానం బుల్లెట్​ బండి ఎక్కితేనే... కచ్చితంగా ప్రత్యేకమే. ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలోని అభిమాని తన ద్విచక్రవాహనాన్ని పూర్తిగా అభిమానంతో నింపేశారు.

NTR fan stickered his bullet with ntr pics at prakasham district
ప్రకాశం జిల్లాలో బుల్లెట్​ను మార్చిన ఎన్టీఆర్​ అభిమాని

By

Published : Jan 4, 2020, 3:20 PM IST

ప్రకాశం జిల్లాలో బుల్లెట్​ను మార్చిన ఎన్టీఆర్​ అభిమాని

లెజెండ్​ సినిమాలో బాలకృష్ణ బండికి కేవలం ఒక సింహం బొమ్మే ఉంది... కానీ ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో తంగేడుమల్లి గ్రామానికి చెందిన ముప్పాళ్ల కోదండరామయ్య బుల్లెట్​కు మాత్రం​​ 40కి పైగా సింహాలుంటాయి. కోదండరామయ్యకు ఎన్టీఆర్​ అన్నా... తెలుగుదేశం పార్టీ అన్నా అంత అభిమానం మరి. తన అభిమానాన్ని సరికొత్తగా చూపాలనుకున్నారు కోదండరామయ్య. తన బుల్లెట్ నిండా ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలతో నింపేశారు. సీనియర్ ఎన్టీఅర్ జస్టిస్ చౌదరి నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ బృందావనం వరకూ... బాలయ్య హిట్‌ సినిమా పేర్లు, ఫోటో స్టిల్స్‌తో బుల్లెట్​ను అందంగా ముస్తాబు చేశారు.

హ్యాండిల్​పై సింహాల బొమ్మలు ఆకర్షణ

తెదేపా అధినేత చంద్రబాబు ఫొటోలను సైతం బుల్లెట్​పై అతికించారు. బండి మొత్తం పసుపు మయం చేశారు. హ్యాండిల్​పై వరుసలో ఉన్న తొమ్మిది సింహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తన అభిమానాన్ని చాటుకునేందుకే ఇలా చేశానని... దీనిపై వెళ్తుంటే ప్రత్యేకంగా చూస్తున్నారని కోదండరామయ్య అంటున్నారు. తన బండితో ఫోటోలు దిగేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారని ఆనంద పడుతున్నారు. ఇలా చేయడం వల్ల నలుగురిలో తాను ప్రత్యేకంగా నిలుస్తున్నానని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పదో తరగతి విద్యార్థి ప్రతిభ... ప్రపంచ రికార్డు దాసోహం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details