NSG Commandant injured in YCP stone pelting: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. చంద్రబాబు పర్యటించకుండా శతవిధాలా ప్రయత్నించారు. చంద్రబాబు రోడ్‌షో నిర్వహిస్తున్న సమయంలో నల్లబెలూన్లతో నిరసనలు తెలిపారు. రోడ్లపైకి వచ్చి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి. రాళ్ల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయాలు అయ్యాయి. ఎన్ఎస్జీ కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డుగా పెట్టి చంద్రబాబును రక్షించాయి. రాళ్లు రువ్వటంపై చంద్రబాబు వైసీపీ శ్రేణుల్ని గట్టిగా హెచ్చరించారు.
ఈ దాడిలో చంద్రబాబు భద్రతలోని ఎన్ఎస్జి కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు గాయం అయ్యింది. వైసీపీ శ్రేణులు కాన్వాయ్ పైకి రాళ్ళు రువ్విన సమయంలో గాయం అయ్యింది. దాడి సమయంలో చంద్రబాబుకు రక్షణగా ఎన్ఎస్జి కమాండోలు నిలిచారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలను చంద్రబాబు కాన్వాయ్ వరకు రానివ్వటంతో ఎన్ఎస్జి కమాండోలు గోడలా అడ్డుగా నిలిచారు.ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఎన్ఎస్జి కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు గాయం అయ్యింది. మూడు కుట్లు వేసి వైద్యులు కట్టు కట్టారు. ఎన్ఎస్ జి బృందం అడ్డుగా లేకపోతే చంద్రబాబుపై రాళ్లు పడేవి అని భద్రతా సిబ్బంది తెలిపారు. సంఘటనను ఎన్ఎస్జీ బృందాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.