కరోనా వైరస్ నిరోధక ద్వారం ప్రకాశంజిల్లా చీరాలలో మూణ్ణాళ్ళ ముచ్చటగా మారింది. పట్టణంలోని నెహ్రూ కూరగాయల మార్కెట్ వద్ద గత నెలలో వైరస్ నిరోధక ద్వారాన్ని మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు. రెండు రోజులు ముచ్చటగా వినియోగించిన తర్వాత దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ ద్వారం పనిచేయడం లేదంటూ స్థానికులు చెబుతున్నారు.
చీరాల రెడ్ జోన్లో ఉండటం వల్ల ఉదయం 6 నుంచి 9 గంటల లోపు మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతులు ఇచ్చారు. మార్కెట్ వద్ద నిరుపయోగంగా ఉన్న వైరస్ నిరోధక ద్వారాన్ని.. ఉదయం వేళ రద్దీగా ఉండే గడియార స్తంభం కూడలిలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.