ప్రకాశం జిల్లా ఇంకొల్లులో ఓ ఫ్లెక్సీ అందర్నీ ఆకట్టుకుంటోంది. పట్టణానికి చెందిన షేక్ ముస్తఫా అనే లారీ డ్రైవర్... 'ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు' అని తన ఇంటి ముందు ఏర్పాటు చేసినఫ్లెక్సీ అందరినీ ఆలోచింపజేస్తోంది.మంచి నాయకుడు కావాలంటే.. ప్రతి ఒక్కరూడబ్బు తీసుకోకుండా ఆలోచించి ఓటు వేయాలని సూచిస్తున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తాను చేసిన చిరు ప్రయత్నం వృథాగా పోదని కొందరిలోనైనా స్ఫూర్తి నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి