ప్రకాశం జిల్లా ఒంగోలులో వైద్య కళాశాల అనుబంధంగా ఉన్న రిమ్స్... సమస్యల వలయంలో చిక్కుకుంది. రోజుకు 1800 మంది ఔట్ పేషంట్లు , 400మంది ఇన్‌పేషెంట్లు ఉండే ఈ ఆసుపత్రిని వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రధానంగా మత్తు వైద్యుల కొరత శస్త్రచికిత్సలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆసుపత్రిలో కనీసం 8మంది మత్తు వైద్యులు ఉండాలి. కానీ 4 పోస్టులే ఉన్నాయి. ఇందులో ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నారు. వీరిలో ఒకరు సెలవులో ఉన్నారు. మిగిలిన ఒక్కరే ఇంతమంది రోగులకు సేవలు అందించాల్సి వస్తోంది. మత్తు వైద్యుడు ఎప్పుడు సమయమిస్తే అప్పుడే ప్రసవాలు చేయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గర్భిణీల సంఖ్య పెరుగుతున్నా.. తగిన మత్తు వైద్యులు, గైనికాలజిస్టులు లేక గుంటూరు ఆసుపత్రికి పంపించేస్తున్నారు. గుంటూరు వరకూ వెళ్లేందుకు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి మత్తు డాక్టర్ సమయం దొరికిందని కాన్పులను ఇచ్చిన తేదీకన్నా ముందే చేసేస్తున్నారు. ఇలాంటి కేసులు విఫలమై ప్రాణాలకు మీదకు వస్తోంది.